అలవాట్లను మార్చడం కష్టం, కుటుంబ నియంత్రణ లాగే!
పరిచయం
పాలకులు తీసుకoటున్న కొన్ని నిర్ణయాలు — సదుద్దేశంతో తీసుకున్నప్పటికీ — భారీ మూల్యాన్ని చెల్లించేలా చేస్తాయి. ఈ నిర్ణయాలు సమాజంలో ఆచారాలుగా (Norms) మారిపోతాయి. సమాజం ఏమనుకుంటుందో అనే భయంతో సహా అనేక కారణాల వల్ల ఎవరూ వీటి నుంచి బయటకు రావడానికి ధైర్యం చేయరు. ఆ తర్వాత వచ్చే తదుపరి దశ —చేసిన దానికి భారీ మూల్యం చెల్లించడం. కుటుంబ నియంత్రణ కూడా అటువంటి ఒక అంశమే.
విశ్లేషణాత్మక దృక్పథం / విశ్లేషణ
“అలవాట్లను మార్చుకోవడం చాలా కష్టం” అని ఒక పాత సామెత ఉంది. ఇది కేవలం వ్యక్తులకే కాకుండా సమాజాలకు కూడా వర్తించే వాస్తవం. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచితాలు (Freebies), ఒకదానితో ఒకటి పోటీ పడాలనే రాజకీయ పార్టీల పోటీతత్వ ఆకాంక్షలే దీనికి ప్రస్తుత ప్రత్యక్ష ఉదాహరణ.
సెప్టెంబరు 2026లో ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (EAC-PM) సిద్ధం చేసిన ‘ది ఘోస్ట్ ఆఫ్ పాపులేషన్ పాస్ట్: హౌ పాపులేషన్ కంట్రోల్ పర్సిస్ట్స్ ఇన్ ఇండియా’ అనే నివేదిక, ‘కుటుంబ నియంత్రణ’ విధానాన్ని తిరగరాయడం చాలా కష్టమని పేర్కొంది; దానికి ఆంధ్రప్రదేశ్ ఒక ఉదాహరణగా నిలుస్తుందని తెలిపింది. సంజీవ్ సన్యాల్, ఆకాంక్ష అరోరా, విరాట్ సింగ్ లు ఈ 63 పేజీల నివేదికను తయారు చేశారు. ఈ నివేదిక నూతన జనాభా వాస్తవికత, చైనా హెచ్చరిక, తప్పుగా కేటాయించిన ప్రోత్సాహకాలు, ప్రస్తుత ఆవశ్యకత గురించి వివరిస్తుంది. చిన్న కుటుంబ నిబంధనలను (Small family norms) మార్చడం సులభం కాదని EAC-PM అధ్యయనం చెబుతోంది.
భర్తీ స్థాయి కన్నా చాలా తక్కువగా (Far below than replacement)
“భారతదేశ జాతీయ మొత్తం సంతానోత్పత్తి రేటు (TFR) 1.9 గా ఉంది, ఇది జనాభా భర్తీ రేటు (Replacement fertility) కంటే చాలా తక్కువ. బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలను మినహాయిస్తే TFR 1.6 గా ఉంది. ఇది ఉత్తర యూరప్ (1.5) మరియు యునైటెడ్ స్టేట్స్ (1.6) లతో సమానంగా ఉంది. జనాభా పరంగా పరిణతి చెందిన దక్షిణ రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ (1.4), తెలంగాణ (1.5), కర్ణాటక (1.5), కేరళ (1.3), తమిళనాడు (1.3) లతో పాటు పశ్చిమ బెంగాల్ (1.3), పంజాబ్ (1.4), గోవా (1.6), హిమాచల్ ప్రదేశ్ (1.5), సిక్కిం (1.0), మహారాష్ట్ర (1.4), ఢిల్లీ (1.2) వంటి రాష్ట్రాలు రెండు దశాబ్దాలకు పైగా భర్తీ స్థాయి కంటే తక్కువ సంతానోత్పత్తి రేటును కలిగి ఉన్నాయి.
దాదాపు 35 సంవత్సరాల సగటు వయస్సుతో (Median age), ఈ రాష్ట్రాలు మన జాతీయ సగటు వయస్సు అయిన 30 సంవత్సరాల కంటే యునైటెడ్ స్టేట్స్ (39) వంటి వయోవృద్ధుల ఆర్థిక వ్యవస్థలకు జనాభా పరంగా దగ్గరగా ఉన్నాయి. భారతదేశంలో వార్షిక జననాల సంఖ్య 2001లో అత్యధికంగా దాదాపు 2.93 కోట్లు (29.3 మిలియన్లు) గా ఉంది. అప్పటి నుండి అది ఐదవ వంతు తగ్గి, 2023 నాటికి దాదాపు 2.32 కోట్లకు (23.2 మిలియన్లు) చేరింది. ప్రస్తుత తరుణంలో, భారతదేశంలో జననాల సంఖ్య దాదాపు యాభై సంవత్సరాల క్రితం 1974లో ఏ స్థాయిలో ఉందో అదే స్థాయిలో ఉంది,” అని నివేదిక చెబుతోంది.
ఇప్పటికీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు ప్రోత్సాహకాలు
ఈ విధానంలో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ప్రోత్సాహకాలు, పరిహారాల కోసం ఆర్థిక కేటాయింపులలో 80 శాతం నేటికీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల (Sterilization) కోసమే జరుగుతున్నాయి. ఈ విధానం ప్రకారం, ఆశా కార్యకర్తలకు ఆర్థిక ప్రయోజనాలు అందిస్తూ జనాభాను నియంత్రించాలని ఆదేశిస్తున్నారు.
“అధిక సంతానోత్పత్తి రేటు ఉన్న రాష్ట్రాల్లో కూడా జనాభా విస్ఫోటనం గురించిన మన ఉమ్మడి భయాలు అసంబద్ధమైనవి. మనం మన జనాభా నియంత్రణ మనస్తత్వం నుండి బయటపడి, మన విధాన లక్ష్యాలను నూతన జనాభా వాస్తవికతకు అనుగుణంగా మార్చుకోవాలి. సంతానోత్పత్తి ఒక ప్రవర్తనా మార్పు స్థాయి (Behavioural tipping point) కంటే తగ్గితే, అది సామాజిక నిబంధనలను మార్చేస్తుందని, దానిని మళ్లీ పాత స్థితికి తీసుకురావడం చాలా కష్టమని ఇతర దేశాల చారిత్రక అనుభవం చూపుతోంది” అని నివేదిక పేర్కొంది.
కౌన్సిల్ సభ్యులు కొన్ని సిఫార్సులు చేశారు — కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలతో ముడిపడి ఉన్న ప్రోత్సాహక చెల్లింపులను ముగించడం, ప్రజలను అటువైపు మళ్లించడానికి చేసే చెల్లింపులను రద్దు చేయడం, జనాభా నియంత్రణ పద్ధతులు, నిబంధనలను వెనక్కి తీసుకోవడం, పరిపాలనా బాధ్యతలను పునర్నిర్వచించడం.
“ఆరోగ్యం, పిల్లల మధ్య వ్యవధి లేదా వ్యక్తిగత ప్రాధాన్యత కారణాల వల్ల చేసే కుటుంబ నియంత్రణకు మేం వ్యతిరేకం కాదు. ప్రభుత్వ విధానం లక్ష్యంగా జనాభా నియంత్రణకు ఇకపై ప్రాముఖ్యత లేదు అనేదే మా నివేదిక యొక్క ప్రధాన అంశం. మన కుటుంబ నియంత్రణ విధానాలు కొత్త జనాభా అవసరాలను ప్రతిబింబించాల్సిన అవసరం ఉంది,” అని సలహా మండలి సభ్యులు తెలిపారు.
చైనా 1980లో ‘ఒక్కరే పిల్లలు’ (One Child Policy) విధానాన్ని ప్రవేశపెట్టి, అవసరమైన సమయం కంటే ఎక్కువగా 2016 వరకు కొనసాగించింది. భారతదేశంలో ప్రస్తుత పరిపాలనా వైరుధ్యాన్ని పరిశీలిస్తున్నప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన ఒక హెచ్చరిక లాంటి పాఠం చైనా అనుభవం.
Media at a Glance
End Sterilization linked-linked incentive payments, roll back population control rules – EAC -PM
India’s birth falls to 1974 level
Social media pulse
https://x.com/sanjeevsanyal/status/2100255676597731496
Our reading list
https://eacpm.gov.in/wp-content/uploads/2026/09/The_Ghost_of_Population_Past_EACPM_final.pdf
